జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీ.వెంకటేశ్ అన్నారు. కర్యాదర్శి సి. వెంకటేశ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఏకం కావాలని అన్నారు. మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు రాష్టంలో దేశంలో తీవ్ర ఇబ్బందులను ఎదురుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 25కోట్లకు పైగా, రాష్టంలో 30 లక్షలకు పైగా నిర్మాణ రంగా కార్మికులు జీవిస్తున్నారని తెలిపారు. అనంతరం మహాసభకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. భవన నిర్మాణ, ఇతర కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, రాజు, గోవర్ధన్, శేఖర్, ఆంజనేయులుపాల్గొన్నారు.