గడువులోగా అనుమతులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అనుమతులు ఇవ్వాలి

Mar 22 2025 1:07 AM | Updated on Mar 22 2025 1:05 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): టీజీ ఐపాస్‌ దరఖాస్తులను పరిశీలించి.. గడువులోగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ హాలులో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. టీ ఫైడ్‌ ద్వారా షెడ్యూల్డ్‌ కులాల వారికి ఒకరికి ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్‌ కింద ఒక కారు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఇద్దరికి కారు, ట్రాక్టర్‌ వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. జెడ్పీ సీఈఓ వెంకట్‌ రెడ్డి, ఆర్డీఓ నవీన్‌, జిల్లా పరిశ్రమల జీఎం ప్రతాప్‌రెడ్డి, ఎల్‌డీఎం భాస్కర్‌, భూగర్భ జలవనరుల శాఖ డీడీ రమాదేవి, టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వందశాతం పురోగతి సాధించాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించి ఈ నెల 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలులో వందశాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం వీసీ నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో కలిగే ప్రయోజనాలను వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. వీసీలో కలెక్టర్‌ విజయేందిర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement