క్యాతూర్‌లో పేలిన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు | - | Sakshi
Sakshi News home page

క్యాతూర్‌లో పేలిన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు

Mar 18 2025 12:32 AM | Updated on Mar 18 2025 12:31 AM

అలంపూర్‌ రూరల్‌: మండలంలోని క్యాతూర్‌ గ్రామంలో 25 కేవీ మూడు నూతన ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 25 కేవీ 3 ట్రాన్స్‌ఫార్మర్లు అకస్మాత్తుగా పేలిపోయి మంటల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విద్యుత్‌ తీగలపై మంటలు వ్యాపించి.. పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, కరెంట్‌ మీటర్లు, సెల్‌ఫోన్‌ చార్జర్లు కాలిపోయాయి. దీంతో భారీగా శబ్దాఆలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్‌ తీగలపై పెద్దఎత్తున మంటలు వ్యాపించి.. గంటపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సుమారు 50 ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా పరికరాలు కాలిపోయి రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని గ్రామస్తులు వాపోయారు.

సమస్య పరిష్కరించిన అధికారులు

షార్ట్‌సర్క్యూట్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిన విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్‌ సిబ్బంది గ్రామానికి చేరుకుని సమస్యను పరిష్కరించి.. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని ఏఈ అఖిల్‌ తెలిపారు. గ్రామంలో లోఓల్టేజీ సమస్య ఉండడంతో సోమవారం 6 గంటల సమయంలో మరమ్మతు చేసిన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే ఇంటర్‌నల్‌ సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయని చెప్పారు. వాటి స్థానంలో 15 కేవీ సామర్థ్యం గల మరో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే పేలిపోయిన మీటర్ల స్థానంలో తమ శాఖ తరపున నూతన మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదన్నారు.

ఇళ్లలో కాలిపోయిన టీవీ, ఫ్రిజ్‌లు, కరెంట్‌ మీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement