నవాబుపేట: మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఈ ప్రాంతంలో నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. స్థానికులు సైతం అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వచ్చిన అందరూ అడవిలో చెట్ల కింద సేదతీరి ప్రకృతిని ఆస్వాదించారు. కాగా ఆదివారంతోపాటు మంగళవారాలు ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. మిగతా రోజుల్లో సైతం ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది.