క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Mar 14 2025 12:49 AM | Updated on Mar 14 2025 1:15 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని డీటీడీఓ ఛత్రునాయక్‌, డీవైఎస్‌ఓ ఎస్‌.శ్రీనివాస్‌ అన్నారు. మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో గురువారం ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులకు ఆయా క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌, వాటర్‌ స్పో ర్ట్స్‌ అకాడమీలకు ఎంపికై తే మెరుగైన క్రీడాశిక్ష ణ లభిస్తుందన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరు వు, 30మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌, 6x10 మీటర్ల షటిల్‌ రన్‌, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్‌ జంప్‌, 800 మీటర్ల రన్‌ అంశాల్లో ఎంపికలు నిర్వహించా రు. కార్యక్రమంలో ఏటీడీఓ చిన్యనాయక్‌, వా ర్డెన్లు రాజేందర్‌, పద్మ, క్రీడాశాఖ కోచ్‌లు సునీల్‌కుమార్‌, పర్వేజ్‌పాష, అంజద్‌ పాల్గొన్నారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

252 మంది గైర్హాజరు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి మ్యాథ్స్‌–2, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష జరిగింది. 36 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,599 మంది విద్యార్థులకు 10,347 మంది హాజరై, 252 మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్‌ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

టెక్నీషియన్‌ విధులు కీలకం

పాలమూరు: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో గురువారం ల్యాబ్‌ టెక్నీ షియన్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ కేక్‌ కట్‌ చేసి ల్యాబ్‌ టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నీషియన్స్‌ విధులు చాలా కీలకంగా ఉంటాయని, వారు ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగానే వైద్యులు రోగికి చికిత్స చేస్తారని తెలిపారు. అనంతరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలోని డయాలసిస్‌సెంటర్‌లో రోగులతో కూడా కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు సునీల్‌, ఆర్‌ఎంఓ జరీనా, శిరీష, దుర్గ, శ్వేత, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ అమరావతి, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటాల్‌ రూ.6,989

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి.

అలసందలు క్వింటాల్‌ రూ.7,072

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం అలసందలు క్వింటాల్‌కు గరిష్టం రూ.7,072, కనిష్టంగా రూ.6,982 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్ట, కనిష్టంగా రూ.5,680, వేరుశనగ గరిష్టం రూ.6,020, కనిష్టం రూ.4,110, జొన్నలు గరిష్టం రూ.4,640, కనిష్టం రూ.2,650, ఎర్ర కందులు గరిష్టం రూ.7,314, కనిష్టం రూ.6,339, తెల్ల కందులు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,650 ధరలు పలికాయి.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ 
1
1/1

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement