నియోజకవర్గ రైతులకు వరప్రదాయిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరుతాను. దీంతోపాటు విద్య, వైద్యం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడంతోపాటు.. మంజూరైన పనులకు టెండర్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. అలాగే ఇప్పటికే మంజూరైన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తాను. – కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి