నియోజకవర్గంలో మరో పదివేల ఎకరాలకు సాగునీరందించేందుకు రేవల్లి మండలం గొల్లపల్లి వద్ద నూతనంగా మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశాం. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఇప్పటికే కేఎల్‌ఐ, భీమా, జూరాల సాగునీటి కాల్వలతో చాలా మేరకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతులు లభిస్తే గొల్లపల్లి రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తిచేస్తాం. రింగ్ రోడ్డు, సాగునీటి కాల్వల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 2,713 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విన్నవిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి