పాలమూరు యువకుడి ఘనత | - | Sakshi
Sakshi News home page

పాలమూరు యువకుడి ఘనత

Mar 10 2025 10:27 AM | Updated on Mar 10 2025 10:23 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రం బోయపల్లి 16వ వార్డుకు చెందిన మల్లేష్‌గౌడ్‌ దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్‌పై సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌ 17న బోయపల్లి నుంచి సైకిల్‌యాత్ర చేపట్టి తాండూరు మీదుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రంలోని రక్సౌల్‌ బార్డర్‌ మీదుగా నేపాల్‌లోకి ఈ ఏడాది జనవరి 23న ప్రవేశించాడు. 45 రోజులపాటు సైకిల్‌పై నేపాల్‌ దేశంలో తిరిగి అక్కడి నయాపూల్‌ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్‌ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌ వద్దకు ఈ నెల 8న చేరాడు. మల్లేష్‌గౌడ్‌ ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి భీమా శంకర్‌, త్రయంభకేశ్వర్‌, గ్రిస్నెశ్వర్‌, సోమనాథ్‌, నాగేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, ఉజ్జయిని, కాశీ జ్యోతిర్లింగాలతోపాటు గుజరాత్‌లోని ధామ్‌ ద్వారకదేశ్‌ను దర్శించుకున్నాడు. ఈ నెల 15న నేపాల్‌ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకుంటానని మల్లేష్‌గౌడ్‌ తెలిపారు. నా సైకిల్‌ యాత్రలో నీటి పొదుపు, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. సైకిల్‌ తొక్కడం ద్వారా ఇప్పుడున్న కలుషిత వాతావరణాన్ని కొంతమేర తగ్గించవచ్చనే ప్రధాన అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. సైకిల్‌పై యాత్రను కొనసాగిస్తూ దేశం మొత్తం తిరగడమే తన ధ్యేయమన్నారు.

సైకిల్‌పై ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల ప్రయాణం

ట్రెక్కింగ్‌ ద్వారా నేపాల్‌లోని అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌ చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement