మదనాపురం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన మదనాపురం మండలం రామన్‌పాడులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రామన్‌పాడుకు చెందిన మత్స్యకారుడు వాకిటి గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున రామన్‌పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. జలాశయంలో గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. అతడి రెండు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య వాకిటి కుర్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.