బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు.. | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు..

Mar 9 2025 12:36 AM | Updated on Mar 9 2025 12:35 AM

హన్వాడ: బతుకుదెరువు కోసం 16ఏళ్ల క్రితం భార్యాపిల్లల్ని వదిలి ఓ వ్యక్తి సౌదీకి వలస వెళ్లాడు. రెండున్నర నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందగా శనివారం అతడి మృతదేహం స్వగ్రామం చేరగా కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని రామాలయంతండాకు చెందిన సబావత్‌ రవి(45) 16 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఏడాదికే అతడిపై మోసానికి సంబంధించిన కేసు నమోదైంది. దీంతో తప్పించుకు తిరిగిన రవి వీసా గడువు కూడా ముగియడంతో స్వదేశానికి వచ్చే వీలు లేకుండాపోయింది. భార్యాపిల్లలకు దూరమై దుర్భరమైన ఏడాది జీవితాన్ని అనుభవించాడు. గత జనవరి 26న గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ డీకే అరుణ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. ఆమె స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడి మృతదేహా న్ని స్వస్థలానికి రప్పించారు. శనివారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా సాయంత్రం కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మృతుడు సౌదీ వెళ్లే సమయంలో అతని కూతురు పూజకు మూడు నెలలు. ప్రస్తుతం ఆమె స్థానిక కేజీబీవీలో 9వ తరగతి చదవుతున్నాడు. కుమారుడు సచిన్‌ (7వ తరగతి వరకే) చదివి మధ్యలో ఆపేసి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య తారాబాయి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మృతుడి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవా లని స్థానికులు కోరుతున్నారు.

రెండున్నర నెలల క్రితం

గుండెపోటుతో మృతి

శనివారం స్వగ్రామం చేరుకున్న

మృతదేహం

అంత్యక్రియలు నిర్వహించిన

కుటుంబీకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement