259 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,303 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,044 మంది హాజరయ్యారు. 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశారు.
18న పీయూలో యువ ఉత్సవ్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 18 జిల్లా యువజన సర్వీసుల ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధికారి కోటానాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ ఉన్న యువతను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. పాటలు, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, ఆర్ట్, సైన్స్‌మేళా, కల్చరల్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
పీయూ పరిధిలోని వనపర్తి పీజీ సెంటర్‌లో 2022లో చేసుకున్న ఒప్పందం మేరకు అక్కడ భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన భవనాలు నిర్మించాల ని హైదరాబాద్ జేఎన్టీయూ వీసీ కిషన్‌కుమార్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ విన్నవించారు. స్పందించిన ఆయన ల్యాబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.