అతివకు అందలం | - | Sakshi
Sakshi News home page

అతివకు అందలం

Mar 8 2025 12:48 AM | Updated on Mar 8 2025 12:47 AM

మహిళలు అన్నిరంగాల్లో

రాణించాలంటే

చదువు ఎంతో ముఖ్యం

కుటుంబ పోషణతో పాటు ఉద్యోగాల్లోనూ రాణించడం ఆమెకే సాధ్యం

ప్రభుత్వం మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకువస్తే మహిళా సాధికారత

ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో మహిళళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్‌

అవగాహన అవసరం..

సమాజం ఎంత అభివృద్ధి చెందినా చాలామంది మహిళలకు బయటి ప్రపంచం గురించి తెలియని పరిస్థితి. అందుకే వంటిళ్లు కుటుంబమే జీవితంగా జీవిస్తున్నారు. అందుకోసం ప్రతి మహిళ తమ హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి సంస్థల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ, చాలా మంది అవగాహన లేనందుకు ప్రతి విషయానికి పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది.

– తనీష, ఎంపీసీ, ఫస్ట్‌ ఇయర్‌

కట్టుబాట్లు ప్రతిబంధకాలు..

మన సమాజంలో మహిళలు సాధికారత సాధించకపోవడానికి కట్టుబాట్లు, పద్ధతులు ఒక ప్రతిబంధకంగా మారాయి. ఉన్న ఒక్క జీవితానికి ప్రతి మహిళ తన లక్ష్యాన్ని, తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. చరిత్రలో ఎంతో మంది మహిళలు దేశ అస్తిత్వం కోసం పోరాటం చేశారు.. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. కొత్త చరిత్ర సృష్టించాలి.

– వాహిని, ఎంపీసీఎస్‌, సెకండ్‌ ఇయర్‌

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం

ఎంత కష్టాన్ని అయిన భరించేతత్వం ఒక్క మహిళకే ఉంటుంది. నేనూ ఒక మహిళ అయినందుకు గర్విస్తున్నా. నాకు అన్ని విష యాల్లో సహకరించే కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. మహిళ సాధికారత, సమానత్వం సాధించాలంటే తప్పకుండా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాలు, మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకురావాలి.

– ఆలియా, ఎంజెడ్‌సీ, సెకండ్‌ ఇయర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఆధునిక ప్రపంచంలో సమాజం ఎంతో అభివృద్ధి చెందినా మహిళలు తక్కువ, మగవారు ఎక్కువ అనే భావన తొలగిపోవడం లేదు. మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే ప్రతి మహిళ కూడా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిబేట్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మహిళగా గర్విస్తున్నా..

సమాజంలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత ఓర్పు మహిళలకు ఉన్నందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం సాధిస్తే సాధికారత సాధ్యపడుతుంది.

– వసంత, ఎంజెడ్‌బీటీ, సెకండ్‌ ఇయర్‌

ఉన్నత విద్యతోనే..

మహిళా సాధికారత సాధించి, సమానత్వం రావాలంటే తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రతి విద్యార్థిని కూడా అనవసర విషయాల జోలికి పోకుండా చదువులపై దృష్టి సారించినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయి.

– భవాని, బీకాం, ఫస్ట్‌ ఇయర్‌

ఉద్యోగావకాశాలు కల్పించాలి..

మహిళా సాధికారత రావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేసే విధంగా అవకాశాలు రావాలి. చదువులు ఉన్నప్పటికీ కొంత మంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ అందిస్తే సులువుగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది.

– నిహారిక, బీకాం, ఫస్ట్‌ ఇయర్‌

పాఠశాల, ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు బాలికలు చదువుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చే సరికి వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మరిన్ని యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు చదువుకునేందుకు ఆస్కారం ఉంది. నాకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులు సహకరించడం వల్ల ప్రిన్సిపాల్‌ స్థాయి వచ్చా. మహిళలకు కుటుంబమే బలం. అలాంటి అవగాహన అందరిలో రావాలి. – పద్మావతి,

ప్రిన్సిపాల్‌, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల

చైతన్యం అవసరం..

చాలామంది మహిళలు అవగాహన లేకకపోవడం, హక్కులు తెలియపోవడం వంటి విషయాల కారణం సాధికారత సాధ్యపడడం లేదు. అందుకోసం సామాజిక అంశాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళలో కూడా చైతన్యం వచ్చి రాజకీయ, సామాజిక, ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరిగితే అప్పుడు మహిళలు పురుషులతో సమానంగా రాణించగలుగుతారు. – నీలిమ, బీబీఏ, సెకండ్‌ ఇయర్‌

తోటివారికి సహకరించాలి..

సమాజంలో మహిళలకు తోటివారే సహకరించాలి. పనిచేసే ప్రదేశం, ఇతర చోట్ల ఎక్కడైనా మహిళలు ఒకరికి ఒకరు సహరించుకుంటే ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. రెండు కొప్పులు ఒక దగ్గర కలవవు అనే నానుడి నుంచి బయటికి రావాలి. ప్రతి మహిళా సాధికారత సాధించాలంటే తప్పకుండా విద్యను ఒక ఆయుధంగా మలచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

– సుభాషిణి, ఎంవీఎస్‌ కళాశాల అధ్యాపకురాలు

కుటుంబమే బలం..

అతివకు అందలం 1
1/10

అతివకు అందలం

అతివకు అందలం 2
2/10

అతివకు అందలం

అతివకు అందలం 3
3/10

అతివకు అందలం

అతివకు అందలం 4
4/10

అతివకు అందలం

అతివకు అందలం 5
5/10

అతివకు అందలం

అతివకు అందలం 6
6/10

అతివకు అందలం

అతివకు అందలం 7
7/10

అతివకు అందలం

అతివకు అందలం 8
8/10

అతివకు అందలం

అతివకు అందలం 9
9/10

అతివకు అందలం

అతివకు అందలం 10
10/10

అతివకు అందలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement