పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష

Mar 7 2025 12:39 AM | Updated on Mar 7 2025 12:39 AM

పుట్ట

పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష

మరో దూడను

హతమార్చిన హైనా

తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట శివారులో సంచరిస్తున్న హైనా గురువారం మరో దూడపై దాడిచేసి హతమార్చింది. చేగుంటకు చెందిన రైతు తుంగని బాలయ్య బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో గేదెలను కట్టివేసి ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. హైనా దాడిలో మృతిచెందిన దూడను గుర్తించారు. అయితే వ్యవసాయ పొలాల వద్ద పశువుల పాకలపై హైనా ఆకస్మిక దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే ఫారెస్టు అధికారులు ఏ జంతువు అనేది గుర్తించక పోగా.. కనీసం బోను కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ముగ్గురు రైతులకు చెందిన దూడలను హతమార్చిందని.. ఫారెస్టు అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అడవి జంతువును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఐదుగురికి రిమాండ్‌

బిజినేపల్లి: గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కనకయ్యగౌడ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని వసంతాపూర్‌ శివారులో బుధవారం జార్కండ్‌ రాష్ట్రానికి చెందిన బిట్టుకుమార్‌ రాం, పుప్పుకుమార్‌, గుడ్లనర్వకు చెందిన మహేష్‌, దుర్గాప్రసాద్‌, ఉదయ్‌ బిజినేపల్లిలో గంజాయి సరఫరా చేస్తుండగా ఎస్‌ఐలు శ్రీనివాసులు, రాజశేఖర్‌ ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని.. వీరి నుంచి 900 గ్రాములకు పైగా గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్‌లు శ్రీనివాసులు, రాజశేఖర్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

మహబూబ్‌నగర్‌ క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ శీనయ్య వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన ఈశ్వరమ్మ (60) కొడుకు శివరాజ్‌ గతనెల 20న మృతిచెందాడు. అతడి అంత్యక్రియల కోసం వైకుంఠ రథంపై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోని పెద్ద శివాలయం వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ఈశ్వరమ్మకు తీవ్రగాయాలు కావడంతో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి కొడుకు అంబుదాస్‌ ఫిర్యాదు మేరకు వైకుంఠ రథం డ్రైవర్‌ ఇసాక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అలంపూర్‌ రూరల్‌: తండ్రి మరణాన్ని పంటిబిగువన ఆపి.. పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలంలోని లింగన్‌వాయి గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా(50)కు ఇద్దరు సంతానం. కాగా చిన్న కుమారుడు సమీర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలోని మైనార్టీ గురుకుల పాఠశాలో ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సమీర్‌ తండ్రి మహబూబ్‌బాషా బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష ప్రారంభం కానుండగా.. ఈ విషయాన్ని సమీర్‌కు ముందు తెలపకుండా పరీక్షకు వెళ్లే ముందు చెప్పారు. తండ్రి మరణ వార్త తెలిసిన సమీర్‌ పంటి బిగువన దుఃఖాన్ని ఆపుకొని పరీక్ష పూర్తి చేశాడు. పరీక్ష అనంతరం స్వగ్రామానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు

జంకుతున్న రైతులు

పరీక్ష అనంతరం తండ్రి

అంత్యక్రియలకు హాజరైన విద్యార్థి

పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష 1
1/1

పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement