వరి నారుమడి.. యాజమాన్య పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

వరి నారుమడి.. యాజమాన్య పద్ధతులు

Jul 3 2024 1:36 AM | Updated on Jul 3 2024 1:36 AM

వరి న

వరి నారుమడి.. యాజమాన్య పద్ధతులు

కోస్గి: రైతులు వానాకాలంలో వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరువుల్లోకి నీరు రాకపోవడంతో బోరుబావులున్న వారు నారుమళ్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నందున నారుమడి.. యాజమాన్య పద్ధతులు, విత్తనశుద్ధితో ప్రయోజనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌ సుధాకర్‌ సమగ్రంగా వివరించారు. ప్రధానంగా బీపీటీ, తెలంగాణ సోనాతో పాటు వివిధ సన్నరకాలను సాగు చేస్తుంటారు. ఏ రకమైన విత్తనమైనప్పటికీ విత్తనశుద్ధితో తెగుళ్లను నివారించవచ్చు.

విత్తనశుద్ధి..

నారు పోసే ముందు విత్తనశుద్ధి చేస్తే పలురకాల కీటకాలు, తెగుళ్లు ఆశించకుండా నివారించుకోవచ్చు. కిలో విత్తనాలను 2.5 గ్రాముల కార్బండిజమ్‌తో కలిపి 24 గంటలు నానబెట్టాలి. లేదా కిలో విత్తనాలకు 3 గ్రాముల కాస్టన్‌ మందు కలిపి మడిలో చల్లుకోవాలి. దీంతో నారుమడిలో ఆకుతినే పురుగు, ఉల్లికోడు, మువ్వ పురుగు ఆశించకండా ఉంటాయి.

నాటు విధానం...

నారులో ఆకు లేతగా, ఆకుమచ్చ గడ ఉంటే చేసు త్వరగా తిరుగబడుతుంది. 4 నుంచి 6 ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నారు లోతులో కాకుండా ౖపైపెన నాటితే ఎక్కువగా పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని బట్టి వానాకాలంలో చదరపు మీటర్‌కు 44 దంట్లు (నారు మొలకలు) ఉండేలా చూసుకోవాలి.

నారుమడి తయారీ..

నారు పోయాల్సిన మడిని 10–12 రోజుల్లో మూడు దఫాలుగా దున్ని చదును చేయాలి. నీరు పెట్టేందుకు, ఎక్కువైతే తీయడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి.

ఎకరా పొలం నాటడానికి 5 సెంట్లు (500 చ.మీ.) నారుమడి అవసరం. సెంట్‌ భూమికి 5 కిలోల విత్తనాలు వాడాలి.

5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్‌ ఉండే ఎరువులు వాడాలి.

కలుపు నివారణ..

నారుమడిలో కలుపు నివారణకు ఎకరాకు బూటాక్లోర్‌ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేదా 8వ రోజున మడిలో నీటిని తొలగించి పిచికారీ చేయాలి.

విత్తిన 10 రోజుల్లో కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలు సెంటు నారుమడికి 150 గ్రాముల చొప్పున వేయాలి. లేదా మోనోక్రోటోపాస్‌ 1.6 మి.లీ. మందును లీటర్‌ నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు పిచికారి చేయాలి.

విత్తిన 15 రోజులకు సైహాలో పాస్‌ బ్యూబైట్‌ 10 శాతం మందు 400 మీ.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

జింక్‌ లోపాన్ని గుర్తిస్తే లీటర్‌ నీటిలో 2 గ్రాముల జింక్‌ పాస్పేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

నారు 20–25 రోజుల వయసున్నప్పుడు 4 నుంచి 6 ఆకుల దశలో నాటుకోవడంతో దిగుబడి అధికంగా వస్తుంది.

విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ

జాన్‌ సుధాకర్‌, డీఏఓ, నారాయణపేట

వరి నారుమడి.. యాజమాన్య పద్ధతులు 1
1/1

వరి నారుమడి.. యాజమాన్య పద్ధతులు

Advertisement
 
Advertisement
Advertisement