మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

Published Sun, Dec 3 2023 12:44 AM

మన్యంకొండలో తిరుచ్చిసేవ నిర్వహిస్తున్న పురోహితులు, భక్తులు  - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్భగుడి నుంచి శోభాయమానంగా అలంకరించిన తిరుచ్చి వాహనంలో దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సన్నాయి వాయిద్యాలు, భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. తిరుచ్చి వాహనంలో స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రకరకాల పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఈ పవిత్ర ఘట్టాన్ని నిర్వహించారు. మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ మధుసూదన్‌కుమార్‌, ఈఓ వెంకటాచారి, సూపరింటెండెంట్‌ నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

అలంకరణలో స్వామివారు
1/1

అలంకరణలో స్వామివారు

Advertisement
 
Advertisement
 
Advertisement