
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పంటల రుణ మాఫీ పొందిన రైతులందరికీ ఈ నెలాఖరు వరకు రుణాలను పునరుద్ధరించాలని కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. గురువారం కొత్త కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వ్యవసాయ, బ్యాంకు నియంత్రణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రుణమాఫీ, రెన్యూవల్ రుణా ల వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నా రు. ఈనెల 21నాటికి రూ.1.20లక్షల వరకు రుణా లు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఈపాటికే 48వేల మంది రైతుల ఖాతాల్లో రూ.295 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రూ.202 కోట్ల రుణాలను తిరిగి రెన్యూవల్ రూపంలో ఇచ్చామ న్నారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, డీఏఓ వెంకటేష్, ఎల్‌డీఎం భాస్కర్, ఎస్‌బీఐ ఆర్‌ఎం అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
15 రోజుల్లో పాఠశాలలను ప్రారంభించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మన ఊరు– మన బడి కింద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్ని పాఠశాలలను 15 రోజులలో ప్రారంభించాలని కలెక్టర్ జి.రవినాయక్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ అనుమతించిన అన్ని పనులను పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తిచేసి వచ్చే నెలలోగా అన్ని పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించారు. రెండో దశ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా గ్రౌండింగ్ కానీ పాఠశాలల్లో కచ్చితంగా గ్రౌండింగ్ అయ్యేలా సంబంధిత ఎంఈఓలు, ఏఈలు ప్రయత్నించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ఈజీఎస్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు డీఆర్డీఓ, సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమన్వయం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డీఈఓ రవీందర్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ గోవర్ధన్‌గౌడ్, శ్రీనివాస్, ఏఈలు, డీఈలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రవినాయక్
వ్యవసాయ అధికారులు,
బ్యాంకర్లతో సమీక్ష