షడ్రుచుల సమ్మేళనం

కాషాయ ధ్వజంతో ఊరేగింపు నిర్వహిస్తున్న వీహెచ్‌పీ నాయకులు  - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శోభకృత్‌ నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లాలో ఘనంగా బుధవారం ఉగాది పర్వదిన వేడుకలు సంప్రదాయబద్దంగా జరిగాయి. మామిడాకుల తోరణాలతో ఇళ్లన్నీ శోభాయమానంగా దర్శనమిచ్చాయి. పండుగ సందడితో పట్టణాలు, గ్రామాలు కోలాహలంగా మారాయి. వ్యాపార సంస్థల్లో, ఇళ్లలో విశేష పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని కాటన్‌మిల్లు వేంకటేశ్వరాలయం, టీడీ గుట్ట తిరుమలనాథుడి ఆలయం, శ్రీనివాసకాలనీ పంచముఖాంజనేయస్వామి, టీచర్స్‌ కాలనీ రామాలయం, బ్రాహ్మణవాడి వాసవీ మాత ఆలయాలు, పద్మావతి కాలనీ కాళికాలయం, వేంకటేశ్వర కాలనీ రాజరాజేశ్వరీమాత ఆలయాల్లో దేవతామూర్తులకు విశేష అభిషేకాలు, అలంకరణ నిర్వహించారు.

● తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పరిమళగిరిలోగల ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. శోభకృత్‌ నామ సంవత్సర ఫలితాలను తెలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడిలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వనితా క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు వలకొండ శ్రీదేవి, ఎదిరె రాధిక, జయశ్రీ, బాలమణి, కల్వ పావని, లావణ్య, హరిత, సుప్రియ, కవిత, గాయత్రి, రేణుక, తేజస్విని, గుబ్బ రాధిక తదితరులు పాల్గొన్నారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధ్వజ ఊరేగింపు

జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం వేపూరి బాలాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు గోమాత పూజలు నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య ఽకాషాయ ధ్వజాన్ని చేతపట్టగా అక్కడి నుంచి రాంమందిర్‌ వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కాషాయధ్వజారోహణ చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ విభాగ్‌ కార్యదర్శి అద్దని నరేంద్ర, జిల్లా కార్యదర్శులు బుచ్చారెడ్డి, రాచాల జనార్దన్‌, నలిగేశి లక్ష్మీనారాయణ, హన్మంతు, సురేష్‌కుమార్‌, సంపత్‌, ఛత్రపతి, సతీష్‌రాఠి, భద్రప్ప, భరత్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు

శోభకృత్‌ సంవత్సరానికి ప్రజల స్వాగతం

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు చోట్ల పంచాంగ శ్రవణం

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top