కూరగాయల మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

కూరగాయల మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

మహబూబాబాద్‌: నూతన సమీకృత కూరగాయాల మార్కెట్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలని సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అజయ్‌సారథిరెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో వినూత్నంగా తోపుడుబండ్లతో నాయకుల మెడలో కూరగాయల దండలు, కూరగాయల బుట్టలతో నిరసన ర్యాలీ నిర్వహించి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లుగా గాంధీపార్క్‌లోనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. మార్కెట్‌ను ప్రారంభించినప్పటికీ కూరగాయల విక్రయాలు జరగడం లేదని, దీని వెనుక కుట్ర జరుగుతుందన్నారు. గాంధీ పార్క్‌లో కూరగాయాల విక్రయాలు జరుగుతుండటంతో రాజకీయ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలకు ఇబ్బంది అవుతుందన్నారు. వ్యాపారులను ఖాళీ చేయించి పార్క్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు పెరుగు కుమార్‌, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్‌, నర్రా సంధ్య, నాయకులు చింతకుంట్ల వెంకన్న, శ్రావణ్‌, సాంబలక్ష్మి, చిరంజీవి, పాల్‌, శంకర్‌, పద్మ, రఫీ, రమేశ్‌, శ్యాంప్రసాద్‌, సాయి, ఉప్పలయ్య, మల్లయ్య ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement