మహబూబాబాద్: ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి పరిష్కరించుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలు, న్యూట్రిషన్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, నిరాశ పడొద్దన్నారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, జిల్లా సంక్షేమాధికారి సబిత, డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్


