సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 6:08 AM

సంక్షిప్త సమాచారం

పెంకు కార్మికుల వేతనాలు పెంపు

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న పెంకు కార్మికుల వేతనాల పెంపు ఒప్పందం జరిగిందని తెలంగాణ టైల్‌ వర్కర్స్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.రాంసింగ్‌ సోమవారం తెలిపారు.

అధిక ధరలకు అమ్మితే చర్యలు

నర్సింహులపేట: ఎరువులను, విత్తనాలను అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని ఎస్సై బానోతు వెంకన్న హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో ఎరువుల షాపు డీలర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్‌, ఏఈఓలు, ఎరువుల షాపు డీలర్లు పాల్గొన్నారు.

బియ్యం అందజేత

దంతాలపల్లి: మండలం బొడ్లాడ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు గ్రామానికి చెందిన కుందూరు శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబాలకు మంగళవారం 50కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశాడు.

క్రీస్తు అంటే క్షమించే హృదయం

కేసముద్రం: క్రీస్తు అంటే ప్రేమ, శాంతి, క్షమించే హృదయమని డబ్ల్యూసీఎం బ్రదర్‌ కిరణ్‌పాల్‌ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని హరిహర గార్డెన్‌లో క్రీస్తు శాంతి మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ నీలం సుహాసినిదుర్గేష్‌, మండల పాస్టర్స్‌ ఫశ్రీలోషిప్‌ అధ్యక్షుడు వల్ల సుధాకర్‌, పిల్లి కుమారస్వామి పాల్గొన్నారు.

ఉద్యమ నాయకుడికి సన్మానం

కొత్తగూడ: ఆదివాసీ గిరిజనుల కోసం తుడుందెబ్బ సంఘం నుంచి ఉద్యమాలు చేసి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన వట్టం ఉపేందర్‌ను స్థానికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనుబాబు, వాసం భద్రయ్య, రామస్వామి, పూనెం సందీప్‌దొర పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ొర్రూరు: గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని ఎస్సై తోట మహేందర్‌ రెడ్డి తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను ఛేదించవచ్చని తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన టోర్నమెంట్‌

కురవి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది. ఈనెల 13న మొదలైన టోర్నమెంట్‌ మంగళవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌ అయ్యగారిపల్లి వర్సెస్‌ తట్టుపల్లి గ్రామాల మద్య జరగగా అయ్యగారిపల్లి టీం విజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకోగా తట్టుపల్లి రన్నరప్‌గా నిలిచింది. తృతీయ బహుమతిని కురవి టీం గెలుచుకుంది. విజేతలకు సర్పంచ్‌ జక్కులమాధవినాగన్న అందజేశారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

తొర్రూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక అనారోగ్య సమస్యలతో మృతి చెందుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ నాయకుడు జక్క మహబుబ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన నర్సింగోజు రుక్కిణమ్మ, శీలం సోమయ్య, దొంతు సత్యం కుటుంబాలకు ఒక్కొక్కరికి 50కేజీల బియ్యంతోపాటు రూ.3వేల నగదును అందించారు.

వీఓఏల సమస్యలు పరిష్కరించాలి

డోర్నకల్‌: వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలు చంద్రకళ కోరారు. స్థానిక ఐకేపీ కార్యాలయం ఎదుట వీఓఏలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాల్గో రోజుకు చేరుకుంది. వెంకటరమణ, బేబీరాణి, శ్రీను పాల్గొన్నారు.

రైతులను ఆదుకుంటాం

తొర్రూరు రూరల్‌: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలకు గురై పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తొర్రూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. ఇటీవల మండలంలోని మాటేడు గ్రామ శివారులో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మామిడి తోటను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ నజీమ్‌మోద్దీన్‌, నాయకులు హనుమాండ్ల నరేందర్‌రెడ్డి, సుంచు సంతోష్‌, ధర్మారపు మహేందర్‌, వల్లపు యాకయ్య, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

యాచకుడి మృతదేహానికి ముస్లింల

అంత్యక్రియలు

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డు ప్రాంతంలో యాచకుడిగా ఉంటున్న షేక్‌.లతీఫ్‌ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి సంబంధీకుల్లో అన్న ఒకరు రాగా జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం యువకులు, పెద్దలు మానవత్వంతో ఆలోచించి ఆర్ధిక సహకారం అందజేసి స్థానిక ఖబరస్తాన్‌ ప్రాంతంలో లతీఫ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో అబ్దుల్‌ నయీం, మహమ్మద్‌ ఫజల్‌, జాకీర్‌ మహమ్మద్‌, మహమ్మద్‌ ఖలీల్‌, జహీర్‌ మహమ్మద్‌, అబ్దుల్‌ సలాం పాల్గొన్నారు.

కక్షతో ఎమ్మెల్యేను రాకుండా చేశారు..

దంతాలపల్లి: మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉందని అన్నివిధాలుగా సమాయత్తం చేయగా కావాలని ఫోన్‌ చేసి, ఎమ్మెల్యే రావడం లేదని చెప్పారని సర్పంచ్‌ సాయిదుర్గా తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొంత మంది రాజకీయ నాయకులు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తమ మీద కక్ష గట్టి ఎమ్మెల్యేను రాకుండా చేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement