– 8లోu
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కరశోభ వెల్లివిరిసింది. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సరస్వతినది అంత్యపుష్కరాలు ఆరంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలిపుష్కరస్నానం ఆచరించారు. మొదటిరోజు ఎండ తీవ్రతతో భక్తుల రద్దీ సాధారణంగా
ఉంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. – భూపాలపల్లి/ కాళేశ్వరం
తొలి పుష్కరస్నానం
ఆచరించిన కంచి కామకోటి
పీఠాధిపతి శ్రీ శంకర
విజయేంద్ర సరస్వతి
ఎండతో తొలిరోజు భక్తుల
పుష్కరస్నానాలు అంతంతే..


