ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

ఎస్పీ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం వల్ల పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ శబరీష్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడ్‌ రిజర్వుడ్‌ సిబ్బందితో గురువారం పోలీసు దర్బార్‌ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆర్ముడ్‌ రిజర్వుడ్‌ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, వీఐపీ బందోబస్తు విధులు, ఎన్నికల డ్యూటీలు, ప్రజాభద్రత విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగల సమయంలో బందోబస్తు బాధ్యతలను ఏఆర్‌ సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అభినందించారు. సిబ్బంది సంక్షేమంపై జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఏఆర్‌ డీఎస్పీలు శ్రీనివాస్‌, విజయ్‌ ప్రతాప్‌, ఆర్‌ఐలు సోములు, భాస్కర్‌, అనిల్‌, నాగేశ్వరరావు, ఆర్‌ఎస్సైలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి..

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మహబూబాబాద్‌ పట్టణంలోని నెహ్రూసెంటర్‌, మదర్‌ థెరిస్సా సెంటర్‌లో పునరుద్ధరించిన ట్రాఫిక్‌ సిగ్నళ్ల పాయింట్లను గురువారం ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement