● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ
మహబూబాబాద్ రూరల్ : దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు పాటుపడాలని డీసీసీ అధ్యక్షురా లు భూక్య ఉమ అన్నారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గురువారం ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. నాయకులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు . టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్లు భాస్కర్, బొల్లు రాజు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


