నేటినుంచి డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

● హాజరుకానున్న 43, 670 మంది విద్యార్థులు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల (సప్లిమెంటరీ/ బ్యాక్‌లాగ్‌) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించబోతున్నారు. వాస్తవంగా డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మే 7 నుంచి, మూడో సెమిస్టర్‌ పరీక్షలు మే 16 నుంచి నిర్వహిస్తామని తొలుత టైంటేబుల్‌ ప్రకటించారు. అయితే పలు కారణాలతో ఆయా పరీక్షలను వాయిదా వేసిన అనంతరం అధికారులు రీషెడ్యూల్‌ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి గురువారం తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 22, 23, 25, 26, 28, 29, 30, జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇక డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 22 ,23, 25, 26, 28, 29, 30, జూన్‌ 1, 2 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు 25,433 మంది, మూడో సెమిస్టర్‌ పరీక్షలకు 18,237మంది, మొత్తం 43,670 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయబోతున్నారని వారు తెలిపారు.115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ఎండలతో విద్యార్థులకు ఇబ్బందులే..

ఓవైపు కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవవుతున్నాయి. దీంతో మండుతున్న ఎండలతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. కాగా, ఎండల సమయంలో పరీక్షల నిర్వహణతో విద్యార్థులే కాదు విధుల్లో పాల్గొనే అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడతారని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం బాధ్యులు గురువారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. మొదటి, మూడో సెమిస్టర్‌ పరీక్షలను రీషె డ్యూల్‌ చేయాలని కోరారు. కానీ యథావిధిగా నిర్వహిస్తామని ఆ విభాగం అధికారులు స్పష్టం చేశారు.

విద్యుత్‌ ఉద్యోగుల

సందేహాలు తీర్చాలి

హన్మకొండ : విద్యుత్‌ ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేశాకే మూడో డిస్కం టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు లై సెన్స్‌ జారీ చేయాలని తెలంగాణ విద్యుత్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో టీవీ జేఏసీ చైర్మన్‌ పి.శ్రీని వాస్‌, కన్వీనర్‌ మన్నె శశికుమార్‌ లేఖ అందించారు. తమ జేఏసీ ఆర్‌పీడీసీఎల్‌ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే ఉద్యోగుల హక్కులకు భద్రత కల్పించాలన్నారు. లైసెన్స్‌ జారీకి ముందు యాజమాన్యం పాత డిస్కంలు, ఉద్యోగ సంఘాల మద్య చట్టబద్ధమైన త్రైపాక్షిక ఒప్పంద చేసుకోవాలన్నారు. ప్రస్తుత డిస్కంలోని ఉద్యోగుల సీనియార్టీలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని, 2004 సెప్టెంబర్‌ 1వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరి న వారందరికీ కోర్టు తీర్పు మేర కు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement