● తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర
అధ్యక్షుడు యాదగిరి
హన్మకొండ: న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మల శోభారాణి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సుల్తాన్ యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేరని, అందుకే ఉద్యమకారుల హామీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. కుటుంబం మొత్తం రూ.లక్ష కోట్లు సంపాదించుకుందని, కుంభ కోణా లకు పాల్పడ్డారన్నారు. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. మరో అతిథి తెలంగాణ ఉద్యమకారుడు కోల జనార్ధన్ మాట్లాడుతూ ఉద్యమకారులు అడ్డుకునే దుస్థితికి రావడానికి జేఏసీకి నా యకత్వం వహించిన కోదండరాం వంటి వారే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాలే మన డి మాండ్లు కావాలన్నారు. సదస్సులో ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల యాదగిరి, నాయకులు రవీందర్, చంద్రకళ, సుశీల, అరుంధతి, పద్మజ, విజయలక్ష్మి, అన్నపూర్ణ, విజయ, రాధిక, రమ, తదితరులు పాల్గొన్నారు.


