దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయి | - | Sakshi
Sakshi News home page

దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయి

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

హసన్‌పర్తి: దేశంలో దోపిడీ, కుల వివక్ష, ఆకలి ఉన్నంతకాలం రాజ్యాంగబద్ధంగా పోరాటాలు ఉంటాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బూర రాకేశ్‌ సంస్మరణ సభ గురువారం చింతగట్టులో జరిగింది. సమావేశానికి ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాకేశ్‌ స్మారకస్థూపం నిర్మిస్తున్న క్రమంలో పోలీసుల చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా తొలుత రాకేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. అమరవీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు, అమరవీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, అభినవ్‌, శాంతక్క, భవాని, కవిత, అనిత, జయంత్‌, ఫణీకుమార్‌, రాకేశ్‌ కుటుబసభ్యులు పాల్గొన్నారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

Advertisement
 
Advertisement
Advertisement