అమ్మమ్మ చెప్పిన కథ
ఒక రోజు ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనిపించింది. దానిని చూసి పరుగెత్తుకుంటు ఒక చెట్టువద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కాడు. రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు. రెండో వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి కదలకుండా కిందే పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. శవంలా పడుకున్న వానిని వాసన చూసి శవమని వెళ్లిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాని దగ్గరకు వచ్చి ‘మిత్రమా ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది’అని అడిగాడు. దానికి సమాధానంగా రెండో వాడు ‘ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వానితో స్నేహం చేయరాదు అని చెప్పింది’అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. –ఆత్మకూరు
నీతి: ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు


