విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం
మేలు చేకూర్చాలి
తొర్రూరు: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం మేలు చేకూర్చాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బుధవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాయిశెట్టి ఉపేందర్, పల్లె కుమార్, పంతం సురేందర్, బందు మహేందర్, వెల్తూరి మల్లేశం, ఎండీ అమీర్, వెలిశాల శ్యామ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి పరామర్శ
మరిపెడ రూరల్: మరిపెడ మండలం గుర్రప్పతండాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు బానోతు వెంకన్న మాతృమూర్తి బానోతు రంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం రంగమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
వడదెబ్బతో వృద్ధుడికి అస్వస్థత
పెద్దవంగర ఎండ తీవ్రతకు తాళలేక ఓ వృద్ధుడు పొలంలోనే కుప్పకూలిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది ఈఎంటీ వనజ, పైలట్ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రానికి చెందిన కుక్కల వీరమల్లు రోజువారి వలే తమ వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పొలంలో ఆకస్మాత్తుగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితిని చక్కదిద్దుతూ వెంటనే తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు రెఫర్ చేశారు.
శంకర్‌నాయక్ జన్మదిన వేడుకలు
నెహ్రూసెంటర్/నెల్లికుదురు/ఇనుగుర్తి/ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలను బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. పలు చోట్లు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి
గార్ల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జి.సక్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. బుధవారం గార్ల సమీపంలోని గండిచెరువు, అప్పసముద్రం చెరువుల్లో ఉపాధి పనులను ఆయన సందర్శించారు.
మంట వేడిమికి వ్యక్తి మృతి
నర్సింహులపేట: మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం బూరగడ్ల వెంకన్న(54) వ్యవసాయ పొలం వద్ద గట్లకు మంట పెడుతున్న క్రమంలో మంటల వేడిమికి అపస్మారకసిత్థిలోకి వెళ్లి పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెంకన్నను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి మృతి చెందినట్లు తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
కురవి: నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం వరంగా మారిందని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేందర్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధ్దిదారులకు టౌన్ సీఎంఆర్‌ఎఫ్ పథకం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్‌రావు, బాలగాని శ్రీనివాస్, మోహన్‌రావు పాల్గొన్నారు.
మరిపెడ రూరల్: సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరంఅని కాంగ్రెస్ పార్టీ ఎల్లంపేట గ్రామ అధ్యక్షుడు గండి వీరభద్రం అన్నారు మండలంలోని ఎల్లంపేటలో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు.


