బాధిత కుటుంబానికి ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

May 21 2026 5:03 AM | Updated on May 21 2026 5:03 AM

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గద్దల ప్రభాకర్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది కలిసి బుధవారం బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏర్పుల సునీతకుమారస్వామి, ఉప సర్పంచ్‌ ఆవుల ఐలయ్య, కార్యదర్శి వెంకన్న, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మృతుడి బాల్య మిత్రులు రూ.18500 అందజేశారు.

పెద్దవంగర: స్నేహితుడి తల్లి మృతి చెందడంతో విషాదంలో ఉన్న కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచి ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన తడకమల్లు యాకయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యాకయ్య చిన్ననాటి స్నేహితులు బుధవారం కలిసి కుటుంబానికి రూ.23వేల నగదును అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement