అగ్నిప్రమాదంలో తోటలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో తోటలు దగ్ధం

May 21 2026 5:03 AM | Updated on May 21 2026 5:03 AM

డోర్నకల్‌: మండలంలోని అమ్మపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో నిమ్మ, మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామ శివారులో ఓ రైతు మొక్కజొన్న పంటకు సంబంధించి పంట కొయ్యలకు నిప్పంటుకుని సమీపంలోని తోటలకు మంటు ఎగబాకాయి. నున్న రమణకు చెందిన నిమ్మ, మామిడి తోటల్లోని చెట్లు మంటలకు కాలిపోయాయి. పక్కనే ఉన్న రైతు సాంక్రియాకు చెందిన బొప్పాయి తోట చుట్టూ మంటలు చెలరేగడంతో బొప్పాయిచెట్లతోపాటు పైపులు దగ్ధమయ్యాయి. మంటలతో రైతు వస్రాంకు చెందిన క్వింటా డ్రిప్‌ పైపులు, రమేష్‌కు చెందిన 60పైపులతో పాటు మూడెకరాల్లో డ్రిప్పులు దగ్ధమయ్యాయి. డోర్నకల్‌ నుంచి ఫైరింజన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

ఫత్తేపురంలో అగ్నిప్రమాదం

తొర్రూరు రూరల్‌: మండలంలోని ఫత్తేపురం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 300వందల ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాప్తించడంతో విద్యుత్‌ వైర్లు, పైపులు, గడ్డి మోపులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు అశోక్‌, రమేష్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement