మహబూబాబాద్ అర్బన్: పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడు ప్రభుత్వ బాలికల పాఠశాలో బుధవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మహబూబాబాద్ బొద్దుగొండ గ్రామంలో ఇంటిగ్రెటెండ్ స్కూల్‌ను రూ.200కోట్లను శంకుస్థాపనను చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 98మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి రూ.8లక్షల 56వేలతో వారికి వీల్‌చైర్లను పంపిణీ చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మేనరికం వివాహలతో పుట్టబోయే పిల్లలు దివ్యాంగులుగా పుడుతున్నారని, దీంతో మేనరికం వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, వార్డు కౌన్సిలర్లు, కాటభాస్కర్, పుచ్చకాయల సరిత, నిమ్మల మాధవి, బోల్లు రాజు, గాడిపల్లి చరణ్, దిలీప్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, బుచ్చయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్


