నెల్లికుదురు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రంలోని ఎంకేఆర్ గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుది. బుధవారంఎస్సై చిర్ర రమేష్ బాబు కలిసి కేసముద్రం సీఐ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. ఈనెల 19న రాత్రి ఎస్సై చిర్ర రమేష్‌బాబు పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదాలు చేశారు. రూ.1,19,750 విలువ చేసే 2.395 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని విచారించగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏదుల రాజ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండలం పాన్నకల్ గ్రామానికి చెందిన మాలెగోని ఆంజనేయులు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేహాల్గం గ్రామానికి చెందిన రామ్‌గోని రాజేష్, రాజ్, భద్రాచలానికి చెందిన రాజేష్ అని తెలిపరాఉ. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్ట్ చేయగా ఇద్దరు రాజ్, రాజేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


