గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

–8లోu

న్యూస్‌రీల్‌

పుష్కర స్నానం..

సకల పాపహరణం!

– 8లోu

త్రివేణి సంగమం వ్యూ

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదికి అంత్య పుష్కరాలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. జూన్‌ 1 వరకు (12 రోజులు) నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.43 గంటలకు నదికి విశేష పూజలతో వేదపండితులు పుష్కరున్ని ఆహ్వానిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి స్నానమాచరించి పుష్కరాలను ప్రారంభిస్తారు. శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజలో మంథని ఽశాసనసభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌, దేవస్థానం అధికారులు, ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌, సభ్యులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు అధికారుల అంచనా.

ఏర్పాట్లు ఇలా:

ఈ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ 3,360 ఆర్టీసీ బస్సులు నడపనుంది. మహిళలకు బస్సు ఉచితం కాగా, పురుషులకు అదనంగా రూ.50 వసూలు చేయనున్నారు. 4.36 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాట్లు చేశారు. 12 రోజులు రోజుకో పీఠాధిపతి పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ప్రతీ రోజు హోమాలు, కాశీ పండితులచే హారతి కార్యక్రమం, తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించారు.

నేటి నుంచి వన్‌వే..

250 ఎకరాల్లో 23 ప్రాంతాల్లో పోలీస్‌ శాఖ పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసింది. వరంగల్‌, కరీంనగర్‌, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు మూడు వైపులా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం వన్‌వేను ఏర్పాటు చేశా రు. గురువారం నుంచి జూన్‌ 1 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. వరంగల్‌ వైపు వాహనాలు బస్వాపూర్‌ మీదుగా కొయ్యూరు, గంగారం ఎక్స్‌రోడ్డు వయా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి కాళేశ్వరం వస్తాయి. కరీంనగర్‌ వైపు వాహనాలు గంగారం ఎక్స్‌రోడ్డు నుంచి దామెరకుంట మీదుగా అన్నారం, మద్దులపల్లి, కాళేశ్వరం వస్తాయి. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం మహదేవపూర్‌, కాటారం మీదుగా వెళ్లాలి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల కోసం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాల్లో వచ్చేవారికి ఘాట్‌ వద్దకు వెళ్లడానికి షటిల్‌ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు అవకాశం కల్పించారు.

కాళేశ్వరంలో నేటినుంచి జూన్‌ 1 వరకు అంత్య పుష్కరాలు

తొలిపుష్కర స్నానం చేయనున్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి

పూజల్లో పాల్గొననున్న మంత్రులు, అధికారులు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం

నేడు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా రాక.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

హోమాలు, టెంట్‌ సిటీ, హారతి, తెప్పోత్సవం, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు

నేడు గవర్నర్‌ రాక

అంత్య పుష్కరాల మొదటి రోజు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పుష్కర స్నానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వీఐపీ ఘాట్‌లోని హెలిపాడ్‌లో దిగనున్నారు. అనంతరం సరస్వతీఘాట్‌ వద్ద పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకోనున్నారు. సరస్వతీ ఘాట్‌లో జరిగే హారతి, తెప్పోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిసింది. రాత్రి కాళేశ్వరంలోనే బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆది పుష్కరానికి ఎంతైతే పుణ్యమో..

అంత్య పుష్కరానికి అంతే పుణ్యం

Advertisement
 
Advertisement
Advertisement