మేము చేసిన మంచి పని..
నేను గీసిన బొమ్మ..
వేసవి శిక్షణ.. భవిష్యత్ రక్షణ
● తాటి ముంజలతో వేడి నుంచి ఉపశమం
వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఇదే సమయంలో ఎండవేడిమికి గొంతు ఆరిపోతోంది. ఫలితంగా ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తాగాల్సి వస్తోంది. అయినా దాహం తీరని పరిస్థితి. అయితే గ్రామాల్లో పలువురు చిన్నారులు మాత్రం చల్లదనం కోసం తాటి వనం బాట పడుతున్నారు. అక్కడ లభించే ప్రకృతి ప్రసాదం తాటి ముంజలు తింటూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.
–బయ్యారం/ఇనుగుర్తి


