సరస్వతి నవరత్న మాల హారతి ప్రత్యేకం
కాళేశ్వరం: సరస్వతీనది అంత్యపుష్కరాల్లో ప న్నెండు రోజుల పాటు ప్రతీ రోజు రాత్రి 7:30 గంటలకు సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని కాశీ పండితులు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో గంగా హారతిలో అనుభవం కలిగిన పండితులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ హారతి దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇందులో తొమ్మిది ప్రత్యేక హారతులు ఉన్నాయి. ఇవి సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో సాగుతాయి. ప్రతీ హారతికి ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలు ఉన్నట్లు పండితులు తెలిపారు.
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహిని సరస్వతీనది మళ్లీ పుష్కర శోభ సంతరించుకుంది. బృహస్పతిలోకి మిథునరాశి ప్రవేశించినప్పుడు గతేడాది మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులు సరస్వతీనది పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. ఏడాది చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పిలుస్తారు. నేటి(గురువారం) నుంచి జూన్ 1వతేదీ వరకు సరస్వతీనది అంత్య పుష్కరాలు జరుగనున్నాయి.
పిండ ప్రదానం:
సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలను తృప్తి పరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రధమని విశ్వసిస్తారు.
నదికి వాయినాలు..
సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమాతల్లికి వాయినాలు సమర్పిస్తారు. చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలు, ముతైదువులకు వాయినాలు అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు.
వీఐపీలకే స్పర్శ దర్శనం..
రూ.100 టికెట్ ద్వారా భక్తులు నేరుగా ప్రత్యేక దర్శనానికి వెళ్లొచ్చు. సాధారణ భక్తులు గర్భగుడి బయ టి నుంచి మండపం గుండా ఎత్తు మెట్ల నుంచి స్వా మివారిని దర్శించుకోవాలి. వీఐపీలకు స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది. వేర్వేరుగా క్యూలైన్లు నిర్మించారు. ప్రత్యేకంగా ఆలయంలో 85 మంది వరకు అర్చక, డోలు, సన్నాయి, ఉద్యోగులను ఏర్పాటు చే శారు. 200మంది వరకు స్కౌట్స్, ఎన్‌సీసీ విద్యార్థు లు సేవలో పాల్గొనున్నారు. సామాన్య భక్తులకు 86 గదుల్లో 40 నాన్ ఏసీవి ఇవ్వనున్నారు. మిగతావి అధికారులకు కేటాయించారు. టెంట్‌సిటీలో డీలక్స్ రూమ్స్ రూ.3 వేలు, ప్రీమియం రూమ్స్ రూ.4వేలు, లగ్జరీ రూమ్స్ రూ.6 వే లు 24 గంటలకు అద్దెకు ఇవ్వనున్నారు.
త్రివేణి సంగమం వ్యూ
ఓంకార హారతి – సర్వ దోష నివారణ
నాగ హారతి –సర్పదోష నివారణ,
ఆరోగ్య ప్రదానం
పంచ హారతి– దీర్ఘాయుష్షు
సూర్య హారతి – రోగ నివారణ,
ఆరోగ్య సమృద్ధి
చంద్ర హారతి – పాడి పంటల పుష్టి,
మనశాంతి
నంది హారతి – ధర్మం, శక్తి, విద్య దానం
సింహ హారతి – నాయకత్వం,
ధైర్యం ప్రసాదనం
కుంభ హారతి – సంపద, సుఖ ప్రాప్తి
నక్షత్ర హారతి – నిర్మల మనస్సు,
కీర్తి పొందడానికి.
జలమే ఆధారం
ఆది పుష్కరానికి ఎంతైతే పుణ్యమో..
అంత్య పుష్కరానికి అంతే పుణ్యం
సరస్వతీనది అంత్యపుష్కరాలకు
అంతా సిద్ధం..
నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు, మంగళ స్నానాలు హిందూ సంప్రదాయంతో ముడిపడ్డాయి. అలాగే, తీర్థయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడిందే. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు జలంతో ముడిపడి ఉన్నాయి. నదీ తీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు పేర్కొంటున్నారు. పితుృరులను ఉద్ధరించడానికి భగీరఽథుడు గంగానదిని భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. నది స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యఫలమని భక్తుల విశ్వాసం.


