బొడ్లాడలో విషాదఛాయలు.. | - | Sakshi
Sakshi News home page

బొడ్లాడలో విషాదఛాయలు..

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

దంతాలపల్లి : నిన్నటి వరకు స్నేహితులతో సరదాగా తిరుగుతూ, కు టుంబాల కోసం కష్టపడి న ముగ్గురు యువకులు క్షణాల్లో శవాలుగా మారడంతో మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదం మూడు కుటుంబాల ఆశలను చిదిమేసింది. చిన్నారుల కళ్లలో తండ్రి కోసం వెతుకులాట, నవ వధువు కళ్లలో ఆరని కన్నీళ్లు, తల్లిదండ్రులో గుండెల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ దుర్ఘటనతో గ్రామమంతా దుఖఃసాగరంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్లాడ గ్రామానికి చెందిన లింగమల్ల సతీశ్‌(28), అల్లి సంపత్‌ (23), పొట్టకార్ల వంశీ(21) మృతి చెందారు. దీంతో గ్రామం గుండెలవిసేలా రోదించింది. ఖమ్మం– వరంగల్‌ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సతీశ్‌, సంపత్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వంశీని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. నిమిషంలో వ్యవధిలో ముగ్గురు కనిపించని లోకాలకు తరలడంతో గ్రామంలో తీరని విషాదం నెలకొంది.

గ్రామస్తులను కంట తడిపెట్టించిన సతీశ్‌ మృతి..

లింగమల్ల సతీశ్‌ మృతి గ్రామస్తులను కంటతడి పె ట్టించింది. ఇప్పటికే భార్యను కోల్పోయిన సతీశ్‌ త న కూతురు సిరిచందన, (12 ఏళ్ల వయస్సు) కుమారుడు బిట్టు(10 ఏళ్ల వయస్సు)ను తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్నాడు. కూతురు ఆ గ్రామ పాఠశాలలోనే ఆరు, కుమారుడు బిట్టు ఐదో తరగతి పూర్తి చేశారు. తల్లి లేకున్నా పిల్లలు ఆనందంగా ఉండాలని సతీశ్‌ కష్ట పడి పని చేసి వారిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కూతురుకు శారీ ఫంక్షన్‌ ఘనంగా చేశాడు. అయితే రోడ్డు ప్ర మాదంలో తండ్రి మృతి చెందడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మృతదేహం మందు ఎంజరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టుకున్నారు.

కుటుంబానికి పెద్దదిక్కు సంపత్‌..

అల్లి సంపత్‌ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందడంతో తానే ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉ న్నాడు. తల్లితో కలిసి కూలి చేస్తూ వీలైనప్పుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా డు. తల్లి సైదమ్మ, తమ్ముడు ముఖేశ్‌, చెల్లి పూజ అ తడిపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం పెద్ద దిక్కపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

పాపం సంధ్య..

కురవి మండలం మాదాపురానికి చెందిన సంధ్య, సంపత్‌ కొన్నేళ్లుగా ప్రేమించున్నారు. నాలుగు నెల ల క్రితం సంధ్య తన తల్లిదండ్రులను ఎదురించి సంపత్‌ను వివాహం చేసుకుంది. ఈక్రమంలో పైళ్లె న నాలుగు నెలలకే భర్త మృతి చెందడంతో ఆ నవ వధువు కన్నీళ్లకు అవధులు లేకుండా పోయాయి.

దిక్కు తోచని స్థితిలో వంశీ కుటుంబం..

పొట్టకార్ల వంశీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. తల్లి సావిత్రి, తండ్రి సుధాకర్‌తో కలిసి హైదరాబాద్‌ కూలీ చేస్తూ అండగా ఉంటున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన వంశీ.. గ్రామంలోనే కూలీతోపాటు ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. తన తమ్ముళ్ల విష్ణు, ముఖేశ్‌ కోసం కష్టపడే వంశీ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. నిన్న, మొన్నటి వరకు కలిసిమొలిసి తిరిగిన ముగ్గురి స్నేహితులు ఒకేసారి మృతి చెందడంతో బొడ్లాడ గ్రామం కన్నీరుమన్నీరుగా విలపిస్తోంది. కాగా, పెద్ద దిక్కులను కోల్పోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితుల మృతిలో

కన్నీరుమున్నీరైన గ్రామం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు

యువకులు దుర్మరణం

కుటుంబాలకు పెద్ద దిక్కులను దూరం చేసిన దుర్ఘటన

Advertisement
 
Advertisement
Advertisement