కమలాపూర్ : బ్రెయిన్ ఫీవర్‌తో ఓ రెండేళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా అతని తల్లిదండ్రులు ప్రాణభిక్ష పెట్టే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఆడుతూ, పాడుతూ సందడి చేయాల్సిన వేదాన్ష్ తమ కళ్లముందే నరకం అనుభవిస్తున్నాడని, దీనిపై దాతలు స్పందించి తమకు కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన పుల్లా సంధ్య, వెంకటేష్ దంపతుల రెండేళ్ల కుమారుడు వేదాన్ష్ కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ ఫీవర్ బారిన పడ్డాడు. దీంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వేదాన్ష్ తల్లిదండ్రులు అంత డబ్బు సమకూర్చుకోలేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఆపరేషన్‌కు అవసరమైన రూ.15 లక్షలు ఎలా సమకూర్చాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం చేసి తమ కుమారుడి ప్రాణం కాపాడాలని వేడుకుంటున్నారు.
బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి
ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అత్యవసరం
దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు


