కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాట్ వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆలయ పరిసరాల్లో నిర్వహణ పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా పూర్తిచేస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భక్తుల భద్రత కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. అంతకు ముందు రూ.2కోట్ల వ్యయంతో గత ప్రభుత్వ హయాంలో మేఘా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. గ్రంథాలసంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ మోహన్‌రెడ్డి ఉన్నారు.


