నర్సింహులపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మీ చెక్కులను, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం నిత్యం పని చేస్తుందన్నారు. అధికారులు అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్థార్ రమేష్‌బాబు, ఎంఆర్‌ఐ అఖీల్, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు జినుకుల రమేష్, దేవస్థానం చైర్మన్ జయపాల్‌రెడ్డి, అలువాల శ్రీనివాస్, దస్రూనాయక్, వెంకట్‌రెడ్డి, వెన్నం రవిందర్‌రెడ్డి, చిర్ర సతీష్, ఖాన్ పాల్గొన్నారు.
దంతాలపల్లి: మండలకేంద్రంలోని బాలాజీ గార్డెన్‌లో బుధవారం ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాలాజీ, యాకన్న, రవి, చంద్రావతి, డీటీ శ్రీలత, ఆర్‌ఐ రాజు పాల్గొన్నారు.


