భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైళ్ల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైళ్ల ఏర్పాటు

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

మహబూబాబాద్‌ రూరల్‌: దక్షిణ మధ్య రైల్వే శాఖ భక్తులకు ఆధ్యాత్మిక యాత్రను అందించేందుకు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైళ్లు ఏర్పాటు చేసిందని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) మేనేజర్‌ పీ.వీ.వెంకటేష్‌ అన్నారు. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. మూడు ప్రత్యేక ప్యాకేజీలను భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైళ్లను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న మొదటి విడత, జూన్‌ 16న రెండవ విడత, జులై 4న మూడో విడత యాత్రల ప్రత్యేక రైళ్లు భక్తులకు సేవలు అందించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో మానిటర్లు సతీష్‌, ప్రశాంత్‌, ట్రావెల్‌ ఏజెంట్లు రేణుకుంట్ల గణేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement