విద్యార్థులు భవిష్యత్‌పై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు భవిష్యత్‌పై దృష్టి సారించాలి

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

విద్యార్థులు భవిష్యత్‌పై దృష్టి సారించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు లక్ష్యాలతో భవిష్యత్‌పై దృష్టి సారించాలని రూరల్‌ సీఐ ఎన్‌. అంజలి అన్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఉషోదయ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అదంజేశారు. బాలికల జూనియర్‌ కళాశాలలో 958మార్కులు సాధించిన సుంకరి హిమబిందుకు రూ. 30వేలు, టైన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు రూ.1000నగదు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, వాకర్స్‌ అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి శంభయ్య, కోశాధికారి మహిపాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు రవీంద్రగుప్త, ఉపాధ్యక్షులు ప్రసాద్‌, కార్యదర్శి గోవర్ధన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరి పమ్మిరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement