టాలెంట్‌ హంట్‌ క్రికెట్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

టాలెంట్‌ హంట్‌ క్రికెట్‌ ఎంపికలు

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

టాలెంట్‌ హంట్‌ క్రికెట్‌ ఎంపికలు

మహబూబాబాద్‌ అర్బన్‌: గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టాలెంట్‌ హంట్‌ క్రికెట్‌ పేరుతో ఎంపికలను నిర్వహిస్తుందని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.అజయ్‌సారథిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమ్మర్‌ క్యాంప్‌లో బుధవారం క్రికెట్‌ క్రీడాకారులతో సమావేశం నిర్వహించారు. 16నుంచి 36 సంవత్సరాల వరకు గల క్రికెట్‌ క్రీడాకారులకు ఓపెన్‌ ఎంపికలు నిర్వహించి అందులో పాల్గొనటానికి ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కోచ్‌ మెతుకు కుమార్‌, హాయ కోచ్‌ వినయ్‌, సాద్విత్‌రెడ్డి, సీనియర్‌ క్రీడాకారులు శ్రావణ్‌, అనిర్వేశ్‌, పరమేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement