మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండల ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడిగా వక్కల శ్రీనివాస్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా తీగల ఉపేందర్ రావు, కోశాధికారిగా దూపటి వినయ్ ఎన్నికయ్యారు. అనంతరం మండల ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అసోసియేషన్ బాధ్యులు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు.
పాఠశాల అభివృద్ధికి కృషి
మరిపెడ రూరల్: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధితోపాటు గిరిజనతండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్కజలతండా సర్పంచ్ బానోతు కొండయ్య అన్నారు. బుధవారం మండలంలోని పర్కజలతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి సర్పంచ్ శంకుస్థాపన చేశారు.


