మక్కలు పోవు | - | Sakshi
Sakshi News home page

మక్కలు పోవు

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
లారీలు రావు..

కొనుగోలు కేంద్రం తనిఖీ

కొత్తగూడ: మండలంలోని ఓటాయి మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మండల ప్రత్యేకాధికారి, డీఈఓ సత్యనారాయణ మూర్తి తనిఖీ చేశారు. ఈసందర్భంగా కొనుగోలు కేంద్రంలోని వసతులు, మక్కల తరలింపు, నిల్వ అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విక్రయించిన రైతుల వివరాలు వెంట వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూపర్‌వైసర్‌ రమేశ్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ గుమ్మడి లక్ష్మీనారాయణ ఉన్నారు.

ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రైతుల నిరసన

నర్సింహులపేట: మండలంలోని వశ్రాంతండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులైనా కాంటాలు పెట్టడం లేదని, గన్నీ సంచులు రావడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ మంగళవారం రైతులు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కోరారు.

నైపుణ్యాలు

పెంపొందించుకోవాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి నైపుణ్యాలు అత్యంత కీలకమైనవి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో యూత్‌ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. చదువుతోపాటు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తద్వారా భవిష్యత్‌ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఐటీఐ, ఐటీసీ కళాశాలల్లో నూతన కోర్సులు అందిస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఓంకార్‌, ఉపాధి శాఖ జిల్లా అధికారి రజిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో యాసంగిలో 1,05,238 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. గతంలో ఎకరానికి 25నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈ యాసంగిలో 40 క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 3.5లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను రైతులు పండించారు. ఇందులో 25శాతం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారని భావించి ఆ మేరకే ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు. అయితే రోజురోజుకూ కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా మక్కలను తీసుకురావడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను 25కు పెంచారు. ఇందుకు అనుగుణంగా రవాణా చేసేందుకు లారీలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారు.

నెలల తరబడి నిరీక్షణ..

కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మక్కలు కాంటాలు పెట్టేవారు లేక కొన్ని రోజులు, కాంటాలు పెట్టిన బస్తాలను ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు, వాహనాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు ఇలా నెలల తరబడి కేంద్రాల్లోనే రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 82,360 మెట్రిక్‌ టన్నుల మక్కలు కాంటాలు పెట్టినా.. వాటిని దిగుమతి చేసేందుకు స్థలం లేదు. మార్క్‌ఫెడ్‌ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడడం చూసిన కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి 600 మేరకు రైతుల ట్రాక్టర్ల ద్వారా పత్తి మిల్లులు, రైస్‌ మిల్లులు, ఫంక్షన్‌ హాల్స్‌ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దిగుమతి చేయాలని ఆదేశించారు. దీంతో కొంత కదలిక వచ్చినా.. అత్యధిక సెంటర్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

50రోజులు గడిచినా రాని డబ్బులు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్చి 27న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 82,360 మెట్రిక్‌ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. అంటే క్వింటాకు రూ.2,400 చొప్పున రూ.197.6కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. అటు కొనుగోళ్ల జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో డబ్బుల వసూళ్లు, అమ్మిన మక్కలకు డబ్బులు ఆలస్యం కావడంతో.. చాలామంది రైతులు మక్కలు తక్కువ ధరకు రూ.1500నుంచి రూ.1800 వరకు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు.

నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు

కాంటాలు పెట్టినా రవాణా ఇబ్బందులు

అన్‌లోడ్‌ కోసం తప్పని నిరీక్షణ

విక్రయించి 50రోజులు దాటినా

జమకాని డబ్బులు

మానుకోట పట్టణంలో కొనసాగుతున్న

ఆక్రమణలు

చెరువులను కూడా వదలిన కబ్జాదారులు

కనుమరుగువుతున్న కుంటలు

చోద్యం చూస్తున్న సంబంఽధిత అధికారులు

పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తి

అంచనాకు మించి మక్కలు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి. ఇప్పటికే 82వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. మరో 20 వేల నుంచి 30వేలమెట్రిక్‌ టన్నుల మేరకు మక్కలు రావచ్చు. పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి అవుతాయి. డబ్బులు కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

–శ్యాం ప్రసాద్‌, డీఎం, మార్క్‌ఫెడ్‌, మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement