పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తనిఖీలు

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ శబరీష్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్‌, రూరల్‌ పోలీసులు మంగళవారం రాత్రి విస్తృతంగా నాకబంది తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో టౌన్‌, రూరల్‌ సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, ఎస్సైలు షాకీర్‌, ఉమ, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement