తాటికాయల హెప్సిబా, ఐదో తరగతి, హిమ్మత్‌నగర్, జఫర్‌గఢ్ మండలం, జనగామ జిల్లా
ఎ.ఆకాంక్ష, 1వ తరగతి,
శ్రీ చైతన్య హైస్కూల్, కడిపికొండ
రొంపికుంట్ల లేక్ష్య,
శంభునిపేట,
వరంగల్
అమ్మమ్మ చెప్పిన కథ
భాష.. వ్యక్తిత్వానికి కొలమానం
అనగనగా ఒక రాజు. అతను ఓ రోజు తన మంత్రి, సైన్యాధిపతి, సేవకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు తప్పిపోయారు. ఒక చెట్టుకింద నీడలో అంధుడైన ముసలి వ్యక్తి కూర్చుని ఉండగా రాజు చూశాడు. అప్పుడు రాజు అతని వద్దకు వెళ్లి ఓ సాదు మహారాజ్ ఎవరైనా ఇటువైపు వెళ్లారా అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు మహారాజా అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్లాడు. అతని వెనుక మీ సైన్యాధిపతి వెళ్లాడు. తర్వాత మీ మంత్రికూడా ఇంతకు ముందే వెళ్లాడు అని చెప్పగానే రాజు ఆశ్చర్యపోయాడు. సాధు మహారాజ్ మీకు కళ్లు కనిపించవు కదా వెళ్లింది సేవకుడు, సైన్యాధిపతి, మంత్రి అని ఎలా గ్రహించారు అని అడిగాడు. మరీ ముఖ్యంగా నేనే మహారాజును అని ఎలా గుర్తించారు అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. నేను మీ నలుగురు మాట్లాడే పద్ధతిని బట్టి గుర్తించా. అందరికంటే ముందుగా వచ్చిన సేవకుడు నా ఎదురుగా వచ్చి నాతో ఏమిరా గుడ్డివాడా ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. కొంత సేపటికి సైన్యాధిపతి వచ్చి ఓ సన్యాసి ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. మరికొంత సేపటికి మీ మంత్రి వచ్చి సాధుజీ ఇటు ఎవరైనా వెళ్లారా అని అడిగాడు. ఇప్పుడు మీరు వచ్చి సాధు మహారాజ్ గారు ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్లాడా అని అడిగారు. అందుకుని మహారాజా ఒక వ్యక్తి మాట ద్వారా అతని హూందాతనాన్ని అతని పదవి, అతడి ప్రతిష్ట ఏమిటో గుర్తించొచ్చు అన్నాడు.
–దుగ్గొండి
నీతి.. వ్యక్తి వ్యక్తిత్వం అతని భాష మీదే ఆధారపడి ఉంటుంది.
వేసవి సెలవుల్లో బాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.


