రీల్స్‌.. రిలాక్స్‌.. | - | Sakshi
Sakshi News home page

రీల్స్‌.. రిలాక్స్‌..

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

వేసవి సెలవుల్లో రీల్స్‌ చేస్తూ శభాష్‌

అనిపించుకుంటున్న అక్కాచెళ్లెళ్లు

కాజీపేట : వేసవి సెలవుల్లో ఆరు బయట తిరగకుండా ఈ అక్కాచెళ్లెళ్లు వివిధ పాటలకు రీల్స్‌ చేస్తూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. కాజీపేటకు చెందిన గౌని రసజ్ఞ గౌడ్‌, గౌని శరణ్య గౌడ్‌ సినిమా పాటలు, జానపద గేయాలను రీల్స్‌ చేస్తున్నారు. అనంతరం గౌని సిస్టర్స్‌ పేరుతో సోషల్‌ మీడియాలో అప్‌లో డ్‌ చేస్తున్నారు. ఆహ్లాదకరంగా ఉంటున్న ఈ రీల్స్‌ చూ స్తున్న వీక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్దికా లంగా తల్లిదండ్రులు స్రవంతి, ఫణీందర్‌ ప్రోత్సహిస్తుండడంతో అక్కాచెళ్లెళ్లు రీల్స్‌ చేస్తూ వేసవి సెలవులను స ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 26 పాటలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. వాటి కి వచ్చిన అభినందనలు చూసి మురిసిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement