జీఐఎస్‌తో వేగవంతంగా లోపాల పరిష్కారం
హన్మకొండ: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విప్లవాత్మకమార్పులతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ముందుకు పోతోంది. మెరుగైన, నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు సేవలు అంది స్తోంది. ఈ క్రమంలో విద్యుత్ లైన్లలో తలెత్తే లోపాలు గుర్తించడం, వాటిని త్వరగా సరిదిద్దేందుకు నెట్‌వర్క్ ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) మ్యాపింగ్ చేపట్టింది. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌లో మొత్తం 33 కేవీ ఫీడర్లు 708, 11 కేవీ ఫీడర్లు 7,047 ఉన్నాయి. ఇప్పటివరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 33 కేవీ 697 ఫీడర్లు, అలాగే 11 కేవీ ఫీడర్లు 2,822 జీఐఎస్ మ్యాపింగ్ పూర్తి అయ్యింది. 2,596 ఫీడర్ల జీఐఎస్ ప్రక్రియ చురుగఆ కొనసాగుతోంది. 1,629 ఫీడర్ల పనులు మొదలు పెట్టాల్సి ఉంది.
స్కాడా నెట్‌వర్క్‌తో అనుసంధానం..
జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల వంటి అన్ని వివరాలు డిజిటల్ రూపంలో భౌగోళిక మ్యాప్‌పై పొందుపరుస్తున్నా రు. స్కాడా నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలు తలెత్తి, అంతరాయం కలిగినప్పుడు త్వరితగతిన పునరుద్ధరించడానికి ఎంతగానో దోహదపడుతుంది. జీఐఎస్‌తో విద్యుత్ లోపాలను సులభంగా గుర్తించవచ్చు. తద్వారా లోపాలను త్వరితగతిన పరిష్కరించవచ్చు. విద్యుత్ సరఫరా అంతరాయాలు తగ్గుతాయి. నెట్‌వర్క్ ప్రణాళిక, విస్తరణ పనులకు సమర్థవంతమైన డేటా అందుబాటులో ఉంటుంది.
మరమ్మతు పనులు మరింత వేగవంతం..
జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన డిజిటల్ డేటాబేస్ రూపొందించడంతో పాటు వాటి నిర్వహణ, నిర్వహణ ప్రణాళికలు, మ రమ్మతులు మరింత వేగవంతంగా నిర్వహిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను శాసీ్త్రయంగా ప్రణాళిక చేయడం, కొత్త లైన్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, లోడ్ ఫోర్‌కాస్టింగ్ వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయనున్నారు.
జీఐఎస్ మ్యాపింగ్‌తో విద్యుత్ లైన్లలో ఉత్పన్నమయ్యే లోపాలను త్వరగా పరిష్కరించవచ్చు. విద్యుత్ లైన్ల నిర్వహణ సులభంగా చేపట్టవచ్చు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు వెళ్తున్నాం.
– కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్


