సంగెం : వడదెబ్బతో వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన రైతు గుండు వెంకటనర్సు(58) మృతి చెందాడు. వెంకటనర్సు సో మవారం మధ్యాహ్నం కాపులకనిపర్తి సొసైటీ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల కాంటా వేయించి సా యంత్రం ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అస్వస్థతకు గురికావడంతో మంగళవారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు శిరీష, అనుషా, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం
హసన్‌పర్తి: అన్నం పెట్టిన ఇంటికే ఓ ప్రబుద్ధుడు కన్నం వేశాడు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. హసన్‌పర్తికి చెందిన రిటైర్డ్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ గుండమీది కోటేశ్వర్‌రావు ఇంటిలో ఇదే గ్రామానికి చెందిన కందుకూరి అశోక్ పనిమనిషిగా చేరాడు. అతని ప్రవర్తనలో మార్పును గమనించిన కోటేశ్వర్‌రావు తర్వాత పనినుంచి తొలగించాడు. కుటుంబపరిస్థితులు బాగాలేవని అశోక్ తిరిగి కోటేశ్వర్‌రావును ప్రాధేయపడడంతో మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. ఉదయం ఉద్యోగానికి వెళ్తూ సాయంత్రం ఇంటిలో ఒంటరిగా ఉంటున్న కోటేశ్వర్‌రావు తల్లికి అశోక్ సాయం చేసేవాడు. 20రోజుల క్రితం కోటేశ్వర్‌రావు తల్లి మంగళసూత్రాన్ని దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేయడం ప్రారంభించాడు. కోటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అశోక్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.
● నిందితుడి అరెస్ట్.. రిమాండ్


