పుష్కర భక్తులకు సమగ్ర వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

పుష్కర భక్తులకు సమగ్ర వైద్యసేవలు

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

కాళేశ్వరం : సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు సమగ్ర వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వెద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ రవీందర్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం కాళేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పుష్కరాల సందర్భంగా భక్తులకు అందించనున్న వైద్య సేవల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు భారీగా వచ్చే భక్తులకు వైద్య శిబిరాల్లో అవసరమైన మందులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు, హనుమకొండ డీఎంహెచ్‌ఓలు మధుసూదన్‌, గోపాలరావు, అప్పయ్య, కాళేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి సుస్మిత, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌

రవీందర్‌ నాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement